విశాలాంధ్ర ధర్మవరం;; క్రికెట్లో బాలికలు చక్కటి ప్రతిభ చాటడం జరిగిందని రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్ డి టి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా అనంతపురంలో ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు, నార్పల అండర్-16 అమ్మాయిలు జట్టు తలపడ్డ గా ,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన నార్పల జట్టు 23.1 ఓవర్లలో 101 పరుగులకి అల్లౌట్ అయింది అన్నారు. ధర్మవరం జట్టు లోని హస్మిత 3 వికెట్లు, తేజు దీపిక 2 వికెట్లు పద్మతికి 2 వికెట్లు దక్కాయి అన్నారు.తదుపరి బ్యాటింగ్ చేసిన 102 పరుగుల లక్ష్యాన్ని ధర్మవరం జట్టు ఎలాంటి వికెట్లు కోల్పోకుండా ఛేదించింది అని తెలిపారు. ధర్మవరం జట్టులోని హస్మిత 44 పరుగులు, తేజు దీపిక 42 పరుగులు చేశారు. ధర్మవరం జట్టు10 వికెట్లు తేడాతో విజయం సాధించారు. గ్రామీణ బాలికల క్రికెట్ లీగ్ 2024 ఫైనల్స్‌కు చేరుకున్నదన్నారు..రేపు ఫైనల్స్ ధర్మవరం-16 బాలికల జట్టు ఏ ఎస్ ఏ-ఏ డి సి ఏ అండర్ -16 బాలికల జట్టు మధ్య జరుగుతాయి అని తెలిపారు. ప్రతిభ చాటిన బాలికలను వారు అభినందించారు. తదుపరి బాలుర విభాగంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ధర్మవరంలో టి సి ఎ అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తలపడ్డగా ,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టి సి ఎజట్టు 34.5ఓవర్లలో 120/10 చేసింది అన్నారు.ధర్మవరం జట్టులోని రాజా 3 వికెట్లు , కుందన్ 3 వికెట్లు సాధించడం జరిగిందన్నారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన ధర్మవరం జట్టు 31 ఓవర్లలో 121/7 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 3 వికెట్లు తేడతో విజయం సాధించి రూరల్ బాయ్స్ క్రికెట్ లీగ్ 2024 ఫైనల్స్‌లోకి ప్రవేశించిందన్నారు.. తదుపరి మరుసటి రోజు అనంతపురంలోని ధర్మవరం-నార్పల మధ్య ఫైనల్స్ జరగనున్నాయి అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు. క్రికెట్లో సత్తా చాటిన బాలురులను కోచ్ రాజశేఖర్ అభినందించారు.
క్రికెట్లో ప్రతిభ చాటిన బాలికలు. కోచ్ రాజశేఖర్
RELATED ARTICLES