Wednesday, December 25, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రజలు మెచ్చే విధంగా కూటమి పాలన సాగుతోంది.. శ్రీరామ్

ప్రజలు మెచ్చే విధంగా కూటమి పాలన సాగుతోంది.. శ్రీరామ్

పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

పార్టీలో అందరికీ తగిన ప్రాధాన్యం ఉంటుందన్న పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం ; కూటమి ప్రభుత్వం ప్రజలు మెచ్చే విధంగా పాలన సాగిస్తోందని.. అందుకే ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం మండల పరిధిలోని ఉప్పునేసినపల్లి పంచాయతీలోని గరుడంపల్లి గ్రామానికి పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన వార్డు మెంబర్ సాకే నాగరాజు, నరసింహులుతో పాటు 15కుటుంబాల వారు పరిటాల శ్రీరామ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో నాయకుల్ని శ్రీరామ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో ఉన్నన్ని రోజులు తమకు ఎలాంటి గుర్తింపు లేదని నాయకులన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి జరుగుతోందన్న కారణంతోనే పార్టీలో చేరామన్నారు. శ్రీరామ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా స్వేచ్ఛలేకుండా పోయిందన్నారు. కేవలం ఎమ్మెల్యేలు వారి అనుచరులే బాగుపడ్డారన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తున్న గుర్తింపు చూసి ఇతర పార్టీల వారు టీడీపీలోకి వస్తున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రధాన్యత ఉంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు