Homeజిల్లాలుఅనంతపురంపరిశ్రమలకు అనుమతులు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలి

పరిశ్రమలకు అనుమతులు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలి

- Advertisement -

ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అనుమతుల మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 66వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్టిక్ ఇండస్ట్రీస్ మరియు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ ) సమావేశాన్ని ఇంచార్జి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సకాలంలో సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులను అందజేసి పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా పరిశ్రమల అధికారిని ఆదేశించారు. సింగిల్ విండో పోర్టల్ లో పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనుమతులను నిర్ణీత సమయంలో ఆమోదించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాస యాదవ్, ఏపీఐఏసి జెడ్ఎం నాగకుమార్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు