Wednesday, December 25, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి12న ఏపీయూడబ్ల్యూజే మహాసభ

12న ఏపీయూడబ్ల్యూజే మహాసభ

విశాలాంధ్ర ధర్మవరం; 2025 జనవరి 12వ తారీకున ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహాసభ నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ పేర్కొంది. ఇటీవలే జిల్లా కమిటీ తో పాటు ధర్మవరం డివిజన్ స్థాయి కమిటీ సభ్యులు మంత్రి సత్య కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలో శ్రీ సత్య సాయి జిల్లా విస్తృత మహాసభ నిర్వహించనున్నామని అందుకు మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా,డివిజన్ కమిటీలు అభ్యర్థించారు. అందుకు మంత్రి కూడా సానుకూలంగా స్పందించి జనవరి 12న మీరు తలపెట్టే మహత్కార్యానికి తప్పకుండా హాజరవుతారని మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. వీరుతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రి సవితమ్మ, ఐ ఎన్ పి ఆర్ మంత్రి పార్థసారధి, వీరితోపాటు జిల్లా ప్రజా ప్రతినిధులు హాజరయ్యేలా తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించడం పట్ల పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మహాసభకు సహాయ సహకారాలు కూడా తమ వంతు ఉంటాయని పాత్రికేయుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ మహాసభ ఏర్పాట్లపై తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ రావును పాత్రికేయులు అభినందించారు. మంత్రి సత్య కుమార్ ను కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుల్లయ్య, బాబు,జిల్లా ఉపాధ్యక్షులు జై నందన్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఉద్దండం చంద్రశేఖర్, ధర్మవరం రెవెన్యూ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జానపాటి మోహన్, అజయ్ చౌదరి తోపాటు డివిజన్లోని అన్ని మండలాల వివిధ పత్రికల పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు