Wednesday, December 25, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు..

ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు..

ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని స్థానిక కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాణిజ్యశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించగా, విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ఆలోచనాత్మకమైన వ్యాసాలు రచించడమే కాకుండా, సృజనాత్మకతను ప్రతిబింబించే విధంగా పోస్టర్లను రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించడం, సామాజిక బాధ్యతను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం అత్యవసరం అని,ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి,” అని తెలిపారు.
పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో అధ్యాపకులు,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు