Thursday, December 26, 2024
Homeజిల్లాలుఅనంతపురంజిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఈ వేడుకలకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రసంగించారు. ఏసు క్రీస్తు ప్రేమకు ప్రతిరూపమన్నారు. ఆయన ప్రేమతో ప్రపంచాన్ని జయించాడన్నారు. ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా చేసుకోవాలని సూచించారు. ఇతరుల పట్ల ప్రేమతో స్నేహభావంగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సేవాభావం, ప్రేమ, మానవత్వం కలిగి ఉండి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈకార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, చర్చి ఫాదర్ వినోద్ కుమార్ , ఆర్ ఐ లు రాముడు, బాబు, పోలీసు అధికారుల సంఘం ర కార్యకర్గసభ్యులు జాఫర్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు గాండ్ల హరినాథ్, తేజ్ పాల్ , శ్రీనివాసులునాయుడు, నాగరాజు, మసూద్ వలీ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు