Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅన్నదాన కార్యక్రమం నిర్వహణ ఎంతో తృప్తినిస్తుంది

అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఎంతో తృప్తినిస్తుంది

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఎంతో తృప్తిని ఇస్తోందని శ్రీ సత్య సాయి సేవాసమితి -గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 320 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ నామాప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో, పట్టణంలోని దాతల సహకారంతో వందలాదిమంది రోగులకు సహాయకులకు అన్నదానం అనే కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేశామని తెలిపారు. ఈ సేవ కార్యక్రమానికి కీర్తిశేషులు దాసరి తులసమ్మ వారి భర్త వెంకటస్వామి వారి దాతృత్వముతో ఈ అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించామని, అందుకు దాతలకు ప్రత్యేకంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న సేవలు అనన్యనీయమని, ఎందరికో స్ఫూర్తిని ఇస్తున్నాయని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరం లాగా మారాయని తెలిపారు. తదుపరి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తరపున సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలని తెలియజేశారు. ఇటువంటి అన్నదాన సేవా కార్యక్రమానికి ఆసక్తి గల దాతలు ఎవరైనా ఉంటే సెల్ నెంబర్ 9966047044 కు గాని 9030444065కు గాని సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు