Thursday, December 26, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికేంద్ర మంత్రి అమిత్ షా ను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి - యం.యం.డి.ఏ.

కేంద్ర మంత్రి అమిత్ షా ను పార్లమెంట్ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలి – యం.యం.డి.ఏ.

విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల నరేష్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం చేపట్టిన కార్యక్రమానికి ధర్మవరం ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ (యం.యం.డి.ఏ) ద్వారా నాయకులు మద్దతు తెలుపుతూ పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అమిత్ షా ఫోటోల ప్రతులను కాల్చి పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం వర్ధిల్లాలి, జోహార్ అంబేద్కర్ అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాను భర్త రఫ్ చేసేంతవరకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలను సలుపుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సయ్యద్ రోషన్ జమీర్, ధర్మవరం నియోజక వర్గం అధ్యక్షుడు సయ్యద్ దాదా పిర్, ఖాదర్ వలీ, నబీ రసూల్, తపాల్ దాదాపీర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు