– యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపు
విశాలాంధ్ర ధర్మవరం; రక్తదానం సులువైనది, విలువైనది, మరువలేనిది. స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి, రక్తదాతలుగా సంసిద్ధులు కండి, రక్తదానం మనుషుల ప్రాణాలతో పాటు మానవతా విలువలను కాపాడుతుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ధర్మవరం జోన్ , ఆత్మీయ ట్రస్ట్, ధర్మవరం సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదానం ఆవశ్యకత గురించి ప్రజలందరికీ తెలియపరచే ఉద్దేశంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో స్థానిక నాయకులు, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులతో కలసి బుధవారం రోజున UTF జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం జోన్ యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, ఆంజనేయులు, , సకల చంద్రశేఖర్, సాయి గణేష్, గడ్డం రామ్మోహన్, హరిశంకర్, వెంకట కిషోర్ మరియు ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు జశ్వంత్ , ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించండి
RELATED ARTICLES