Friday, December 27, 2024
Homeఆంధ్రప్రదేశ్జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత

జగన్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న వైసీపీ అధినేత

క్రిస్మస్ వేడుకల కోసం పులివెందులకు వెళ్లిన జగన్ వివిధ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రజల నుంచి ప్రస్తుతం జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. వినతుల స్వీకరణ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. పులివెందుల నుంచి జగన్ రేపు బెంగళూరుకు తిరుగుపయనం కానున్నారు.
జీaస్త్రaఅ ్‌ూRజూ

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు