Friday, December 27, 2024
Homeజిల్లాలుఅనకాపల్లిఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) శతాబ్ది వార్షికోత్సవం …

ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) శతాబ్ది వార్షికోత్సవం …

విశాలాంధ్ర – చోడవరం : భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి నేటికీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని నూరవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో అనకాపల్లి జిల్లా చోడవరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో శతాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కమ్యూనిస్ట్ మహిళా నాయకురాలు ఇమ్మంది కొండమ్మ పార్టీ జెండా ఆవిష్కరించి వార్షికోత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక కర్షకుల కోసం నేటికీ అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని తెలియజేశారు.
నిరంతరం కార్మికులు, పీడిత ప్రజానీకం, బడుగు బలహీనవర్గాల తరపున పోరాటం చేస్తూనే ఉందన్నారు.
జీవితంలో ఒక్కసారైనా కమ్యూనిస్టు గా ఉండాలని,
కమ్యూనిస్టు పార్టీలో సభ్యులమై ఉండడం మన యొక్క గర్వకారణం అని,
ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులుగా సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయం దురాక్రమణలపై పోరాటం చేయాలని, అప్పుడే నిజమైన కమ్యూనిస్టుని తెలియజేశారు.
కార్మికులు, కర్షకులు హక్కులు గూర్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆబోతుల శ్రీనివాసరావు, విస్సరుపు నాగూరు, పుల్లేటి అప్పారావు, సోమదల లక్ష్మణరావు, కాకి కోటేశ్వరరావు, జోగ అప్పారావు, సంపంగి సత్యవతి, చిరంజీవి, శివకుమార్, శ్రీను, కమ్యూనిస్టు పార్టీ, అనుబంధ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు