Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత

- Advertisement -

నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు


విశాలాంధ్ర ధర్మవరం: మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రీన్ ధర్మవరం క్లీన్ ధర్మవరం అనే లక్ష్యంతో భాగంగా పట్టణంలోని సూర్య హైస్కూల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం సూర్య హై స్కూల్ ఆవరణములో మొక్కలను నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అంతా పదివేల చెట్లను నాటాలన్న గొప్ప లక్ష్యంతో మంత్రి సత్య కుమార్ యాదవ్ ముందుకు వెళుతున్నారని తెలిపారు. తదుపరి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గాన్ని పచ్చదనంతో నింపడానికే విస్కృతంగా మొక్కలు నాటాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య హై స్కూల్ హెడ్మాస్టర్ నరేంద్ర , ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు