Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి సహాయం

విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి సహాయం

- Advertisement -

నిత్యవసర సరుకులు అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం: ఇటీవల పట్టణంలోని తిక్క స్వామి నగర్కు చెందిన వెంకటలక్ష్మి నివాసంలో విద్యుత్ షార్ట్ షర్టు కావడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో వారింట్లో ఉన్న గృహోపకరణాలు ఫర్నిచర్ వంట సామాగ్రి నిత్యవసర వస్తువులు పూర్తిగా కాలిపోయి సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితురాలు వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యము నిత్యావసర సరుకులను అందజేశారు. మీ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వారు భరోసా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిష్ రాజు తో పాటు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు