Homeసినిమాబాలీవుడ్ నటి అమీషా పటేల్‌పైనాన్-బెయిలబుల్ వారెంట్

బాలీవుడ్ నటి అమీషా పటేల్‌పైనాన్-బెయిలబుల్ వారెంట్

- Advertisement -

ముంబై: ప్రముఖ నటి అమీషా పటేల్‌పై ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన ఒక ఈవెంట్ వివాదంలో అమీషా పటేల్‌పై ఈ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెకు కోర్టు అనేకసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన ఈవెంట్ వివాదం ఏమిటంటే… ఈవెంట్ నిర్వాహకుడు పవన్ వర్మ నవంబర్ 16, 2017న జరిగిన ఒక వివాహంలో ప్రదర్శన కోసం అమీషాకు రూ.14.50 లక్షల అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే మొరాదాబాద్ ల్లీ రోడ్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో ఆమె బసకోసం ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమె ఈవెంట్‌లో పాల్గొనడం లేదని పవన్ వర్మకు షాక్ ఇచ్చింది. అయితే తర్వాత, ఆమె తనకు పవన్ వర్మ ఇచ్చిన పూర్తి డబ్బు తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది. కానీ రూ.10 లక్షలు నగదు రూపంలో తిరిగి ఇవ్వగా… మిగిలిన రూ.4.50 లక్షలకు ఇచ్చిన చెక్కు బౌన్స్ అయిందని…అమీషాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు నుంచి అనేకసార్లు ఆమెకు సమన్లు జారీ చేసినా కూడా అమీషా కోర్టుకు హాజరు కాలేదు. దీంతో తాజాగా కోర్టు ఆమె హాజరును నిర్ధారించడానికి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వివాదంపై అమీషా తరపు న్యాయవాది అభిషేక్ శర్మ స్పందిస్తూ.. ఈ విషయం 2017 నాటిదని, ఇప్పటికే ఒక ఒప్పందం ద్వారా ఈ సమస్య పరిష్కారం అయిందని తెలిపారు. ఒప్పందం ప్రకారం.. అమీషా పవన్ వర్మకు పూర్తి మొత్తాన్ని తిరిగి ఇచ్చిందని ఆయన తెలిపారు.
వివాదంపై అమీషా పటేల్ వివరణ…
ఈ వివాదంపై తాజాగా అమీషా పటేల్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ‘పవన్ వర్మతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గతంలోనే సెటిల్‌మెంట్ పూర్తి అయింది. ఆ మేరకు పవన్ వర్మ ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. తను అంగీకరించిన మొత్తాన్ని ఆయనకు ఎప్పుడో చెల్లించాను. అయినప్పటికీ అతను ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు నమోదు చేసినట్లు కనిపిస్తోంది. నా న్యాయవాదులు తను నాపై చేస్తున్న మోసానికి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికైనా ఆయన తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి’ అని అమీషా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు