Homeఅంతర్జాతీయంపిల్లలపై లైంగిక వేధింపుల కేసులోభారతీయుడి అరెస్ట్

పిల్లలపై లైంగిక వేధింపుల కేసులోభారతీయుడి అరెస్ట్

- Advertisement -

వాషింగ్టన్: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. నిందితుడిని ఓడెల యశస్వీ కొత్తపల్లిగా గుర్తించారు. సరైన పత్రాలు లేకుండా అతడు దేశంలోకి ప్రవేశించినట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు. న్యూజెర్సీలో 13 ఏళ్ల లోపు చిన్నారులను నిందితుడు లైంగికంగా వేధించినట్లు యశస్వీపై అభియోగాలు నమోదయ్యాయి. దొంగతనాలు, శాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, నిందితుడిపై కేసు ఎక్కడ నమోదైంది? ఎప్పుడు అరెస్ట్ చేశారనే వివరాలను మాత్రం అమెరికా అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, అతడిని దేశం నుంచి బహిష్కరించేందుకు న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు