Homeఆంధ్రప్రదేశ్ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

- Advertisement -

ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో మొత్తం 1,433 ఖాళీ పోస్టులు ఉన్నట్లు గుర్తించామని,వీటిని మూడు ప్రధాన విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వంట మనుషులు,హాస్టళ్లలో ఇతర పనులకు సహాయకులుగా హెల్పర్లు,హాస్టల్ ప్రాంగణాలు శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య సిబ్బందిని నియమించనున్నట్లు చెప్పారు.

నియామకాలు అవుట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో చేపట్టే అవకాశం
ఈ క్రమంలో 142 మంది కుక్‌, లేబర్‌ పోస్టులు, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఈ నియామకాలు అవుట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ విధానంలో చేపట్టే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
సిబ్బంది భర్తీతో పాటు హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. గత కొంతకాలంగా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.కొత్తగా ఏర్పాటు చేయనున్న 10 ఎంజేపీ బీసీ గురుకులాలు
ముఖ్యంగా విద్యార్థులకు సరైన పోషకాహారం అందించడంలో కుక్‌లు, హెల్పర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ, ఈ నియామక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదే సమయంలో 10 ఎంజేపీ బీసీ గురుకులాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే 6 గురుకుల పాఠశాలలను కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అంతేకాదు, పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.420 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రూ.933 కోట్లు కేటాయించినట్లు సభకు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు