Homeజిల్లాలుఅనంతపురంబైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు –కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు –కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

- Advertisement -

మెడికవర్ వైద్యుల కీలక సూచనలు
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : బైపాస్ సర్జరీ (సి ఏ బి జి ) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని బుధవారం విలేకరుల సమావేశంలో
మెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు.డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకుంటి మాట్లాడుతూ… తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ గుండె రక్తనాళాల్లో తీవ్రమైన బ్లాకేజీలు ఏర్పడిన కేసును విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు. 2008లో ట్రిపుల్ వెసెల్ బైపాస్ సర్జరీ చేయించుకున్న రోగి ఇటీవల తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో మెడికవర్ హాస్పిటల్స్‌లో చేరారు. యాంజియోగ్రామ్ పరీక్షల్లో గతంలో అమర్చిన గ్రాఫ్ట్‌లలో తీవ్రమైన బ్లాకేజీలు ఉన్నట్లు గుర్తించారు. అత్యాధునిక ఇవిస్ సాంకేతికత సహాయంతో రెండు స్టెంట్లను విజయవంతంగా అమర్చడం జరిగిందన్నారు . ప్రస్తుతం రోగి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారన్నారు.బైపాస్ సర్జరీ అనేది గుండె సమస్యలకు ముగింపు కాదు, ఒక దశలో చికిత్స మాత్రమే. శస్త్రచికిత్స అనంతరం కూడా రోగి జీవనశైలిలో మార్పులు చేయకపోతే, బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ నియంత్రణలో లేకపోతే మళ్లీ బ్లాకేజీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఛాతీ నొప్పి లేదా శ్వాస ఇబ్బందిని సాధారణ గ్యాస్ సమస్యగా తీసుకోవడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. క్రమం తప్పకుండా ఫాలో-అప్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.” అని తెలిపారు.క్రమం తప్పని వైద్య పరీక్షలు బైపాస్ సర్జరీ తర్వాత ప్రతి సంవత్సరం గుండె చెకప్ చేయించుకోవాలి.వైద్యుల సూచన మేరకు 5 ఏళ్లకు ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకోవడం మంచిది.ఈసీజీ, ఈకో, టీఎమ్‌టి వంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు.
రక్తపోటు 120/80కు దగ్గరగా ఉంచుకోవాలి.షుగర్ ఉన్నవారు హెచ్ బి ఏ 1సి స్థాయిని నియంత్రణలో ఉంచాలి.చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డి ఎల్) స్థాయిని తగ్గించడం అత్యంత ముఖ్యం.
రక్తం పల్చబడే మందులు (బ్లడ్ తినర్స్ ) వైద్యుల సలహా లేకుండా ఆపకూడదు.
మందులు మానేయడం వల్ల స్టెంట్ లేదా గ్రాఫ్ట్‌లో మళ్లీ గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది.
తక్కువ నూనె, తక్కువ ఉప్పు, తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి.
పండ్లు, కూరగాయలు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి.రెడ్ మీట్, వేయించిన పదార్థాలు తగ్గించాలి.
రోజుకు కనీసం 30 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.
అధిక బరువు గుండెపై ఒత్తిడిని పెంచుతుంది.ధూమపానం పూర్తిగా మానేయాలి.
మద్యం సేవించడం తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి.
నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు:
ఛాతీలో ఒత్తిడి లేదా నొప్పిమెడ, భుజం, ఎడమ చేతికి నొప్పి వ్యాపించడం
స్వల్ప శ్రమకే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అసాధారణ అలసట
అకస్మాత్తుగా చెమటలు పట్టడం“బైపాస్ సర్జరీ ఒక కొత్త ఆరంభం మాత్రమే. ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన పరీక్షలు మరియు మందుల వినియోగం ద్వారానే గుండెను దీర్ఘకాలం రక్షించుకోవచ్చు.”
మెడికవర్ హాస్పిటల్స్ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ సదుపాయాలు మరియు అనుభవజ్ఞులైన గుండె నిపుణుల బృందంతో క్లిష్టమైన గుండె సమస్యలకు సమర్థవంతమైన చికిత్సను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు