Homeజిల్లాలుకర్నూలుముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన కంపాటి పెద్ద హనుమంతుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 32,714 రూపాయల చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి బుధవారం లబ్ధిదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న అదే గ్రామానికి చెందిన ఎంజీ నరసన్న తండ్రి అయిన మల్దమ్మ గారి రామాంజనేయులను పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, సొసైటీ సభ్యులు ఎంజీ నరసన్న, నాయకులు గౌళ్ల నల్లారెడ్డి, బుసిరెడ్డి, కల్లు లక్ష్మన్న, కోడిగుడ్ల లక్ష్మన్న, సుక్కు నరసన్న, కంపాటి రాముడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు