విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు): మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎల్ పీఓ షేక్ నూర్జహాన్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సంపద సృష్టి కేంద్రాలు అందుబాటులోకి తీసుకోరావాలన్నారు. ఇంటింటి సర్వే పగడ్బంధీగా చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద బోర్డు ఏర్పాటు చేసి మరుగుదొడ్డి కూర్చుంటే జరిమాన విధిస్తామని దండోరా వేయించాలన్నారు. గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారాన్ని వేస్తే హోటళ్ల యజమానులకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, ఎంపీడీఓ జయరాముడు, ఆదోని ఈఓఆర్డి జనార్ధన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.