మన్మోహన్ సింగ్ గారి మరణం దేశానికి తీరని లోటు
ధర్మవరం నియోజకవర్గ స్వమన్వయకర్త నరేష్ యనమల
విశాలాంధ్ర ధర్మవరం; భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని, వారి మృతి జీర్ణించుకోలేని ఘటన అని, కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ స్వమన్వయకర్త నరేష్ యనమల అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆకస్మిక మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రి గా ఆర్బీఐ గవర్నర్ గా , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా భారతదేశం ఆర్థికంగా నిలదుక్కోవటంలో, ప్రపంచంలోమూడవ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మన్మోహన్ సింగ్ పాత్ర మరచిపోలేనిదని కొనియాడారు. ఈ దేశ ప్రధానిగా మూడు కోట్ల మంది రైతుల రుణమాఫీ ఒకే విడతలో చేసిన ఘనత మన్మోహన్ సింగ్ కే చెందుతుందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం తో పాటు దాదాపు 14 రకాల చట్టాలను సామాన్యులకు, పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి చరిత్ర పుట్టలో నిలిచిపోయారని, ఆయన మృతి ఈ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ తీరని లోటుగానే ఉంటుందని అన్నారు.