Wednesday, January 1, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ వ్యవసాయ భూమిలో 12అడుగులు రస్తా ఉండాల్సిందే..

ప్రభుత్వ వ్యవసాయ భూమిలో 12అడుగులు రస్తా ఉండాల్సిందే..

-రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ కేశవనాయుడు

విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో ప్రభుత్వ ఆసైన్మెంట్ వ్యవసాయ భూమిలో ఇతర రైతులకు రస్తా లేదు అని చెప్పే అధికారం ఏ రైతుకూ లేదని 12 అడుగుల రోడ్డు వదలాల్సిందేనని ఆనంతపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీఓ) గుత్తా కేశవనాయుడు అన్నారు. హంపాపురం గ్రామంలో తహశీల్దార్ పి.విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆర్డీఓ హాజరై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యలను విన్నారు. 2006 నుంచి తన భూమి ఆక్రమణలో ఉందని తనకు ఇప్పించాలని కోరారు. చుక్కల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రైతులు తన అనుభవంలో ఉన్నట్లు ఆర్.హెచ్. కాపీ, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, లింక్ డాక్యుమెంట్లు చూపించాలన్నారు. తన భార్య సాగు చేసుకుంటున్న భూమికి అసైన్మెంట్ డి.పట్టా ఇస్తామని రెవెన్యూ అధికారులు ఏడాది క్రితం వివరాలు సేకరించి పట్టా ఇప్పటికీ ఇవ్వలేదని ఓ రైతు ఆర్డీఓను కోరగా దీనిపై తగు చర్యలు తీసుకోవాలని తహశీల్దారును ఆదేశించారు. రెవెన్యూ అధికారులు వారికి కేటాయించిన గ్రామాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్వే రామాంజనేయులు, ఆర్ఐ కరుణాకర్, వీఆర్ఓ శిరీష, ఎంపీటీసీ మోదుపల్లి రవి, గోనుగుంట్ల జయప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ మధు, సోంభాస్కర్, ప్రతాప్, ధనలక్ష్మి, సీతారాం, యోగేంద్ర, డీలర్ వెంకీ, సర్వేయర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు