Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గెలుపు కోసం సింధు వంద శాతం కృషి చేసింది

పీవీ సింధు తండ్రి పీవీ రమణ
టోక్యో: ఒలింపిక్స్‌లో రెండోసారి పతకం ఖాయం చేసుకుంటుందనుకున్న పీవీ సింధు నిరాశ పరిచింది. ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో తైపీ తై జు యింగ్‌తో సెమీస్‌లో తలపడిన పీవీ సింధు 18-21, 11-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. పీవీ సింధు, తై జు యింగ్‌ ఇప్పటి వరకూ 19 సార్లు తలపడగా.. ఇందులో ఏకంగా 14 సార్లు పీవీ సింధుని తైజు ఓడిరచడం గమనార్హం. కాంస్య పతకం కోసం చైనా షట్లర్‌ హి బింగ్జియావోతో పీవీ సింధు ఆదివారం సాయంత్రం తలపడనుంది. కాగా సెమీస్‌లో పీవీ సింధూ ఓటమి పాలవ్వడంపై ఆమె తండ్రి పీవీ రమణ స్పందించారు. సెమీస్‌లో గెలుపు కోసం సింధు వంద శాతం కృషి చేసిందని రమణ తెలిపారు. అయితే సింధూ కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉందన్నారు. పీవీ సింధు అటాకింగ్‌ గేమ్‌ ఆడలేకపోయిందని.. ఓటమికి కారణాలను వివరించారు. సింధు ప్రత్యర్థి తైజూయింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌.. ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడిరదని చెప్పారు. సింధూకి నిన్న ప్లస్‌ అయిన నెట్‌ గేమ్‌ ఇవాళ మైనస్‌ అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింధు కోచ్‌ మీద తమకు ఏ విధమైన అసంతృప్తి లేదని చెప్పారు. సింధు రేపు బాగా ఆడి కాంస్యం సాధిస్తుందని భావిస్తున్నా అని రమణ ఆశాభావం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img