Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్గోదావరి- కృష్ణ నదుల అనుసంధానాన్ని సిపిఐ స్వాగతిస్తుంది

గోదావరి- కృష్ణ నదుల అనుసంధానాన్ని సిపిఐ స్వాగతిస్తుంది

నదుల అనుసంధానికి ప్రాజెక్టులో ప్రైవేట్ భాగస్వాములను సరైంది కాదు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్

విశాలాంధ్ర అనంతపురం ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన నదుల అనుసంధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రైవేట్ భాగస్వాములను పిలవడం సరైనది కాదని వారిని అనుమతించరాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, జిల్లా కార్యదర్శి సి జాఫర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి జగదీష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన నదుల అనుసంధాల కార్యక్రమాన్ని సిపిఐ స్వాగతిస్తోందన్నారు. గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి బొల్లాపల్లి, బొల్లాపల్లి నుంచి బనకచర్లకు కూడా గోదావరి జలాలను తరలించడం జరుగుతుందని సీఎం తెలియజేయడం జరిగిందన్నారు. పోలవరం నుంచి 300 టీఎంసీ గోదావరి నీటిని సీఎం ప్రతిపాదన చేస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. దీనికి సుమారు 90 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగిందన్నారు. గోదావరి నుంచి కృష్ణ వరకు కృష్ణ నుంచి బోళ్ల పల్లి నుండి బనకచర్లకు, బనకచర్ల రిజర్వాయర్ నుంచి రాయలసీమ ప్రాంతాలలో సాగునీటి ప్రాజెక్టులకు సాగునీటిని అందించడానికి వీలు అవుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా ప్రాజెక్టు నిర్మాణానికి ప్రైవేట్ భాగస్వాములను పిలవడం సరైనది కాదన్నారు. దేశంలో ఎక్కడా కూడా నదుల అనుసంధానంలో ప్రైవేట్ భాగస్వామ్యం లేదన్నారు. ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహిస్తే వా రు డబ్బు ధ్యేయంగా పనిచేస్తారన్నారు. నేషనల్ రోడ్ పై టోల్ గేట్ పెట్టినట్లు నీటికి కూడా మీటర్లు పెట్టి డబ్బులు పెట్టవలసి వస్తుందన్నారు. ప్రైవేట్ భాగస్వాములు త్రాగునీరు, సాగునీటి నిర్మాణంలో అడుగుపెడితే రైతాంగానికి, ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకూడదని కోరుతున్నామన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి సామాన్యులకు రోజు రోజుకు కష్టతరంగా పరిస్థితులు మారుతున్నాయని, దీనిపై టిటిడి బోర్డు అధ్యయనం చేసి సామాన్య భక్తులకు సర్వదర్శనం త్వరగా జరిగేటట్లు చూడాలని కోరుతున్నాం. . బ్రేక్ దర్శనాల పేరుతో ఆంధ్ర ,తెలంగాణ ఎంపీ ,ఎమ్మెల్యేలకు బ్రేక్ దర్శనాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శించుకోవడం కష్టతరంగా మారింది అన్నారు. సామాన్య ప్రజల సర్వ దర్శనంలో దర్శించుకోవడానికి దాదాపు 28 గంటల నుంచి 48 గంటలు పడుతుందన్నారు. ఇంత కష్టపడి వచ్చిన సామాన్య భక్తులు కూడా ఎల్ (ఎల్ 2) దర్శనాలు చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుచున్నామన్నారు. అదేవిధంగా 300 రూపాయలు టికెట్ తీసుకున్న భక్తులకు కూడా తిరుమల లో వసతి సౌకర్యం కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిలు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, నగర కార్యదర్శి శ్రీరాములు, నగర సహాయ కార్యదర్శి అలిపిర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు