దేశంలోని ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం బుధవారం సాయంత్రం మాస్టర్ క్వశ్చన్పేపర్లు, ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. తాజాగా గేట్ ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు తమ ఎన్రోల్మెంట్ ఐడీ/ఈ-మెయిల్ అడ్రస్, పాస్వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు (GATE 2026 Results) తెలుసుకోవచ్చు.


