Thursday, January 9, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.. సిపిఐ, సిపిఎం నాయకులు

అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.. సిపిఐ, సిపిఎం నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం; పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ర్ గురించి అనుచిత వాక్యాలు చేసిన హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని,దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వామపక్షాల డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు ధర్మవరంలోనీ స్థానిక కళాజ్యోతి సర్కిల్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగినది. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురించి పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ను అవమానించడం జరిగినదని, భారతదేశ ప్రజల హక్కులను విధి విధానాలను. బడుగు బలహీన వర్గ ప్రజల హక్కులను,కార్మిక హక్కులను కించపరిచే విధంగా ఉందని దుయ్యబట్టారు. భారతదేశ సౌభ్రాతృత్వాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజల సమాన తత్వాన్ని, ప్రజల అన్ని రకాలుగా స్వేచ్ఛస్వాతంత్రాలతో. వాక్ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరమైన అన్నిటిని రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి, భారత దేశ ప్రజలందరూ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించడానికి అవసరం ఉన్న అన్ని విధివిధానాలను రూపొందించి, భారతరాజ్యాంగాన్ని. నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి దేశ ప్రజలందరూ ఆయన యొక్క శ్రమను ఔన్నత్యాన్ని గుర్తించి భారత దేశ ప్రజలు స్మరించుకుంటున్న నారని తెలిపారు. ఓర్వలేని భారత దేశ హోం మంత్రి ఆయనను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉన్నదని, రాజ్యాంగాన్ని సైతం మార్పులు చేయడానికి అనేక రకాల కుట్రలు అవకాశాలు చూస్తున్నారని వారు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత దేశ ప్రజలందరికీ ఉన్నదని, ఎంతో మహోన్నతంగా ఉన్న రాజ్యాంగం పట్ల దాడులు చేస్తున్న ఇటువంటి ప్రభుత్వానికి తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హోం మంత్రి వెంటనే రాజీనామా చేసి, భారతదేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, దేశ ప్రధాని సైతం హోంమంత్రికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జే వి రమణ, అయూబ్ ఖాన్, బాషా,సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవి కుమార్, సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్ష,కార్యదర్శులు పోల లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, రైతు సంఘం కార్యదర్శి మారుతి, కదిరప్ప, సిఐటియు నాయకులు ఆదినారాయణ,సిపిఐ నాయకులు శ్రీధర్,గంగాధర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నాగార్జున,యువజన-ఏఐవైఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు సకల రాజా, నాయకులు ఆదినారాయణ,శ్రీనివాసులు,నారాయణస్వామి , తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు