Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లానిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం

నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం

- Advertisement -


లంకా గోవిందరాజులు

విశాలాంధ్రవిజయవాడ: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ లంకా గోవిందరాజులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరుద్యోగ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ప్రభుత్వానికి మోసపూరిత ప్రకటనలు వద్దు , వివిధ ప్రభుత్వ శాఖలలో 99 వేల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే, కేవలం 10,000 పోస్టులతో సరిపెట్టడం నిరుద్యోగ యువతను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న 99 వేల పోస్టులతో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉగాది సందర్భముగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒక ప్రహసనంగా ఉందని అయన ఎద్దేవా చేసారు. నోటిఫికేషన్ ఎప్పుడు..? పరీక్ష ఎప్పుడు…? ఫలితాలు ఎప్పుడు…? అనే స్పష్టత లేని జాబ్ క్యాలెండర్లతో నిరుద్యోగుల కంటితుడుపు చర్యలను నిరుద్యోగ జేఏసీ అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రతి పోస్టుకు ఖచ్చితమైన టైమ్ లైన్ విధించి. ఖాళీలను భర్తీచేయాలని, ఎన్నికల హామీలను విస్మరిస్తే పతనం తప్పదని, అధికారంలోకి వచ్చేందుకు నిరుద్యోగులను పావులుగా వాడుకుని, ఇప్పుడు వారిని నట్టేట ముంచాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యోగమైనా ఇవ్వండి లేకపోతే మీ ఎన్నికల హామీ మేరకు నెలకు రూ3 వేలు నిరుద్యోగ భృతియైనా ఇవ్వాలి లేకపోతే ఏపీ నిరుద్యోగ జెఏసిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ శక్తులను ఏకంచేసి త్వరలో రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు