Friday, April 18, 2025
Homeతెలంగాణనాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ యజమాన్యం బెయిల్‌ పిటిష‌న్

నాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ యజమాన్యం బెయిల్‌ పిటిష‌న్

డిసెంబ‌ర్ 4న పుష్ప‌2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా చోటు చేసుకున్న‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యజమాన్యం తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. సంధ్య‌ థియేటర్‌ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి బెయిల్‌ పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో ఏ1గా పెద్దరామిరెడ్డి, ఃఏ2ఃగా చిన్నరామిరెడ్డి ఉన్న సంగ‌తి తెలిసిందే. దాంతో కౌంటర్‌ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను న్యాయ‌స్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నార‌ని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు