విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లను, వంట పాత్రలను (60 వేల రూపాయల విలువ) మాజీ ఎమ్మెల్యే పళ్లెం వెంకటేష్ కుమారుడు పల్లెం జనార్దన్ చేతుల మీదుగా ప్రిన్సిపాల్ ప్రశాంతి కు అందజేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యార్థులకు ఇటువంటి సహాయ సహకారం మేము అందించడం మాకెంతగానో తృప్తి తోపాటు ఆనందాన్ని ఇస్తోందని తెలిపారు. మరిన్ని సహాయ సహకారాలు మున్ముందు అందజేస్తామని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రశాంతి మాట్లాడుతూ విద్యార్థులకు, కళాశాలకు ప్రస్తుత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అందించడం శుభదాయకమని, దీంతో దాతలు కూడా సహకరించి మాకు పూర్తి దశలో కార్యాలు జరగడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. దాతల సహకారం లేనిదే ఏ పని కూడా విజయవంతం కాదని తెలిపారు. తదుపరి దాతలను కళాశాల కమిటీ, ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్లేట్లు, వంట పాత్రల వితరణ..
RELATED ARTICLES