Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే ఏపీ చేనేత కార్మిక సంఘం లక్ష్యం

చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే ఏపీ చేనేత కార్మిక సంఘం లక్ష్యం

విశాలాంధ్ర -ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే ఏపీ చేనేత కార్మిక సంఘం లక్ష్యంగా పని చేస్తోందని, స్వాతంత్రం వచ్చి ఏళ్లు గడిచిన చేనేత పరిశ్రమను నమ్ముకున్న చేనేత కార్మికులకు న్యాయం జరగడం లేదని, నిరంతరం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకే ఏపీ చేనేత కార్మిక సంఘం పనిచేస్తుందని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ధర్మవరం నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణ చేనేత కార్మిక సంఘం నాయకులు, చేనేత కార్మికుల నడుమ 2025 సంవత్సరపు ఏపీ చేనేత కార్మిక సంఘం క్యాలెండర్లను వారు పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు, కదిరి రైల్వే గేటు వద్ద గల నేతన్న విగ్రహం వద్ద విడుదల చేశారు. అనంతరం చేనేత కార్మికులకు, నియోజకవర్గ ప్రజలకు వారు నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, చేనేత కార్మిక సంఘం నాయకులు నడుమ ఈ నూతన క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామం అని తెలిపారు. ఈ క్యాలెండర్ ప్రతి చేనేత కార్మికునికి చైతన్యాన్ని కలిగించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. నేడు భారతదేశంలోని ధర్మవరం పట్టుచీరలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ధర్మవరంలో నేసే వస్త్రానికి చరిత్ర తో పాటు సాంప్రదాయం దేశముతో ముడిపడి ఉందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడిచిన చేనేత పరిశ్రమలో మార్పు రాలేదని, అభివృద్ధి జరగలేదని, పాలకవర్గాలు, ప్రభుత్వాలు మారినా కూడా చేనేత పరిశ్రమ మరుగున పడిపోవడం దారుణమని తెలిపారు. పవర్లూమ్స్ మగ్గాలు రావడంతో, చేనేత కార్మికుల యొక్క జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని, ఉపాధి కోల్పోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన నేడు కార్మికులు ఆకలి చావులతో, ఆత్మహత్యలతో చనిపోవడం నిజంగా దురదృష్టకరమని తెలిపారు. ఇంత జరుగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చలనం లేకపోవడం దారుణము కాదా? అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తదుపరి చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, జిల్లా చేనేత అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేటి ప్రభుత్వాలు మరమగ్గాలను మాత్రమే ప్రోత్సహిస్తూ, అనేక పథకాలను వారికి అనుమతులకు ఇవ్వడం వలన, చేనేత పరిశ్రమ మరుగున పడిపోవడం, చేనేతల జీవన ఉపాధి కూడా కోల్పోవడం జరుగుతోందని తెలిపారు. నిరంతర పోరాటమే లక్ష్యంగా, చేనేత కార్మికులను, చేనేత పరిశ్రమను పరిరక్షించుట మా ధ్యేయమని వారు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఏర్పడి ఆరు నెలలు గడిచిన చేనేత కార్మికుల సమస్యలు, చేనేత పరిశ్రమ అభివృద్ధి ఏమాత్రం నోచుకోలేదని వారు మండిపడ్డారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఉన్నా కూడా ఇంతవరకు చేనేతల సమస్యలపై, వారి అభివృద్ధిపై, వారి జీవనోపాధిపై చర్చించిన పాపాన పోలేక పోవడం దారుణము కాదా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారిన, అధికారుల మారిన చేనేతల తలరాతలు మారకపోవడం, వారి ఉపాధికి భద్రత లేకపోవడం క్షమించరాని ఘటన అని తెలిపారు. ప్రతి చేనేత కార్మికునికి ముద్ర రుణాలు విధిగా ఇవ్వాలని, 200 యూనిట్ విద్యుత్తును ఉచితంగా పంపిణీ చేయాలని, ఉపాధి భద్రత వెంటనే కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రులు చేనేత పరిశ్రమపై భరోసాతో కూడిన ప్రకటన ఇవ్వాలని తెలిపారు. ధర్మవరంలో చేనేత పరిశ్రమ కుంటు పడడంతో, తినడానికి, జీవించేందుకుగాను చేనేత కార్మికులు వలసలు పోతున్నారని వారు మండిపడ్డారు. కనీసం ధర్మారం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పెనుకొండ ఎమ్మెల్యే, చేనేత జోలి శాఖ మంత్రి సవిత ఇప్పటికైనా చేనేత పరిశ్రమను కాపాడుకునేందుకు, చేనేత కార్మికుల ఉపాధిని కాపాడేందుకు వారితో సభలు నిర్వహించి, వారి అభివృద్ధికి బాట వేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామితో పాటు మహదేవన్, కమతం కాటమయ్య, రవికుమార్, రమణ, చెన్నంపల్లి శ్రీనివాసులు, శ్రీధర్, బాల రంగయ్య, శ్రీనివాసులు, సురేష్, వీరనారప్ప, కేశవ, నరసింహులు, మల్లికార్జున, వెంకటరమణ, శివ, చంద్రమోహన్, నాగేంద్ర, రామకృష్ణ, కొండ, ఏఐవైఎఫ్ సకల రాజా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు