Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి9న నిర్వహించబడే మెగా జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి..

9న నిర్వహించబడే మెగా జాబ్ మేళాలు సద్వినియోగం చేసుకోండి..

మంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు సిఎన్బి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు దాదాపు 90 కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బండ హరికృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఇటువంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్లాలని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంస్కృతి సేవా సమితి సహకారంతో బహుళ జాతీయ 90 కంపెనీలు యాజమాన్య ప్రతినిధులు హాజరవుతున్నట్టు వారు తెలిపారు. శ్రీ సత్య సాయి జిల్లాలోని నిరుద్యోగ యువతీ ,యువకులకు ఇది ఒక చక్కటి అవకాశం అని, తమ విద్యా అర్హతలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని వారు తెలిపారు. పదవ తరగతి నుండి ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, బీఫార్మసీ, ఏం ఫార్మసీ, నర్సింగు, ఏదైనా డిగ్రీ, ఏదైనా బీటెక్, పీజీ చదివిన వారు అర్హులని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదివేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్, ఆధార్ కార్డు, రెండు ఫోటోలతో రావలసి ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 91 82288465కు గాని 9490442576 కు గాని 9390176421 సంప్రదించాలని తెలిపారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ జాబ్ మేళా ను సద్వినియోగం చేశారని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు