Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేశ స్త్రీవాద ఉద్యమ స్థాపికురాలు సావిత్రి పూలే ..

దేశ స్త్రీవాద ఉద్యమ స్థాపికురాలు సావిత్రి పూలే ..

కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం: భారతదేశ చరిత్రలో భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలిగా సావిత్రి పూలే పరిగణించబడుతారని వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కారణం హర్ష వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా సావిత్రీ బాయి ఫూలే జయంతిని స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాల నందు కేకు కట్ చేసి విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో తన భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి భారతదేశంలో మహిళల హక్కులను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారని, కులం, లింగం ఆధారంగా ప్రజల పట్ల వివక్ష మరియు అన్యాయమైన ప్రవర్తనను రద్దు చేయడానికి కృషి చేసారని తెలిపారు. మహిళల అభ్యున్నతికి వారు ఎంతో కృషి చేశారని వారి విధానాల వలన నేడు మహిళలకు, విద్యార్థినులకు ప్రత్యేక కళాశాలలు కూడా ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్,అధ్యాపకులు శ్రీనివాసులు, శిరీష బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు