విశాలాంధ్ర, ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని కొలిమి లేఅవుట్, న్యూ జగనన్న కాలనీ ప్రాంతంలో శనివారం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ణలో భాగంగా విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉరవకొండ సిఐ మహానంది ఆధ్వర్యంలో ఉరవకొండ పోలీస్ సిబ్బంది, వజ్రకరూరు పోలీస్ సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా, మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఉరవకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ కింద కార్డన్ అండ్ సెర్చ్
- Advertisement -
RELATED ARTICLES


