Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగర్భిణీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పక పాటించాలి..

గర్భిణీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పక పాటించాలి..

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు..చిన్న తంబి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పక పాటించాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబంలోని సభ్యులందరూ కూడా గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు వారికి సహాయ సహకారాలను అందిస్తూ నెలవారి ఆరోగ్య పరీక్షలను, టీకాలను తప్పక వేయించారని తెలిపారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకోవాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని, ఎటువంటి టెన్షన్లు పడకూడదని తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతగా మానవతా సంస్థ డైరెక్టర్ రామకృష్ణ మనవడు తన్వీక్ నందన్ పుట్టినరోజు సందర్భంగా విరారం ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. మా సంస్థ ఇప్పటి వరకే ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిందని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వేణుగోపాల్ ,కార్యదర్శి మంజునాథ్, కోశాధికారి చంద్రశేఖర్,సభ్యులు రామకృష్ణ, గట్టు వెంకటేష్, శివానంద తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు