Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..

- Advertisement -

అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ స్పీడ్ బ్రేకర్ ను ఎత్తుగా ఉండటం గమనించకపోవడం వల్ల ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక రాత్రి సమయాలలో కూడా నాలుగు చక్రాల వాహనాలు కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి విభాగపు అధికారులు స్పీడ్ బ్రేకర్ ఎత్తును తగ్గించాలని, లేదా తొలగించాలని వాహనదారులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు