Tuesday, January 7, 2025
Homeజిల్లాలుకర్నూలుఎస్టీయూ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

ఎస్టీయూ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): మండల ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో మండల విద్యాశాఖ అధికారి తిరుమల రావు, ఎస్ టి యు రాష్ట్ర నాయకులు నాగరాజు, జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ నాగేంద్రప్ప, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లప్ప, మండల అధ్యక్ష, కార్యదర్శులు రామాంజిని, మురళి కృష్ణ ల చేతులు మీదుగా క్యాలెండర్, డైరీ లను ఆవిష్కరించారు. ముందుగా ఎంఈఓ-2 తిరుమలరావును ఎస్టియు మండల శాఖ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యాశాఖలో తలెతుతున్న సమస్యలు పరిష్కరించడంలో ఎస్టియు ఎల్లప్పుడు ముందు ఉంటుందన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమ ధ్యేయంగా ఎస్టీయూ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు సీనియర్ నాయకులు కాశీ విశ్వనాథ శాస్త్రి, జ్యోతి మూర్తి, లక్ష్మీపతి, బసవరాజు, నాగరాజు, శ్రీరంగ, ఉరుకుందు, లక్ష్మీనారాయణ, నాగార్జున, వినోదకుమార్, తులసయ్య, జ్యోతి లక్ష్మి, శోభారాణి, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు