Homeఅంతర్జాతీయంమళ్లీ దాడులకు పూనుకుంటున్న అమెరికా, ఇజ్రాయిల్

మళ్లీ దాడులకు పూనుకుంటున్న అమెరికా, ఇజ్రాయిల్

- Advertisement -

తెహ్రాన్: పశ్చిమాసియా మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారింది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అమెరికా`ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధవాతావరణ కనిపిస్తోంది. ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించేందుకు అమెరికా, ఇజ్రాయిల్ సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడం ఆందోళన కలిగిస్తోంది. హోర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇరాన్‌పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించేలా ట్రంప్ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరాన్‌ను నలువైపులా నిర్బంధించి, హర్మూజ్ జలసంధిపై నియంత్రణ తెచ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా… ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇరాన్‌పై దాడులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ తన సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడుల పునరుద్ధరణ విషయంలో ట్రంప్ నిర్ణయం కోసం ఇజ్రాయిల్ ఎదురుచూస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. అయితే, ఈలోగా తెహ్రాన్ తమపై దాడి చేస్తే మాత్రం ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఐడీఎఫ్ హెచ్చరిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు