Homeతెలంగాణఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం

- Advertisement -

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నవని పేర్కొన్న మంత్రి, ఈ రెండు అంశాలు మినహా మిగతా అన్ని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్టు గుర్తుచేసిన ఆయన, ప్రస్తుతం డీఏ బకాయిలు ఏవీ పెండింగ్‌లో లేవని చెప్పారు.ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన పీఆర్సీ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వెల్లడించారు.సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు