Tuesday, January 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా యువర్స్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా యువర్స్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కొత్తపేటలో గల ఉషోదయ ఉన్నత పాఠశాలలో యువర్స్ ఫౌండేషన్ 11 వ వార్షికోత్సవ వేడుకలు అధ్యక్షులు షీలా నాగేంద్ర ,ఉపాధ్యక్షులు సుకుమార్, కార్యదర్శి జయరాం, సహకార దర్శి గొర్రె రమేష్ బాబు, కోశాధికారి వంకదారి మోహన్,పి ఆర్ ఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం యువర్స్ ఫౌండేషన్ కమిటీ వారు మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కొన్ని సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరాలు, ప్రతి గురువారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, అదేవిధంగా రక్తదానం, నేత్రదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయాలకు, పాఠశాలలకు ఇప్పటివరకు 120 ట్యాంకులను సభ్యులు వంకదారి రామచంద్ర గుప్తా దాతగా వ్యవహరించి ఇవ్వడం జరిగిందన్నారు. దాతల సహాయ సహకారములతోనే యువర్స్ ఫౌండేషన్ ప్రజల మన్ననలు పొందిందన్నారు. అనంతరం యువర్స్ ఫౌండేషన్కు సహాయ సహకారాలు అందించిన దాతలందరినీ కూడా కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ సుబ్బారావు, చాంద్ బాషా, స్టార్ ఖలీల్, మల్లికార్జున, రామాంజి ,పల్లా లక్ష్మీనారాయణ,చింతా శ్రీనివాసులు, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథ్, వైకే శ్రీనివాసులు, రామచంద్ర గుప్తా, రంగం ఆది, ఆదిశేషు, నామాల శ్రీనివాసులు, పిన్ను ఆదిశేషులు, శత్రశాల మల్లికార్జున, మామిళ్ళపల్లి ప్రసాద్, సతీష్, గూండా నాగరాజు, శ్రీనివాసులు, వాసుదేవుడు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు