Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఒక వరము లాంటిది..

మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఒక వరము లాంటిది..

ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:; మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక వరంలా మారిందని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో హరీష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మంచి విద్య అధ్యాపకులు బోధించేలా కృషి చేయాలని వారు తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రతినిధిగా తాను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఈ మధ్యన భోజన కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ ఆదర్శ మహిళ పేరు పెట్టడం శుభసూచకమని తెలియజేశారు. అనంతరం హరీష్ బాబు తో పాటు ఎంఈఓ గోపాల్ నాయక్ విద్యార్థులకు స్వయంగా వడ్డించిన తర్వాత, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి, పాలెం జనార్ధన్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు