Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి..

చేనేత సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి..

ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్కు ధర్మవరంలోఘన సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మిక సంఘం నాయకులు చేనేత సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చేనేత సమస్యలను శాసనసభలోను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు సహకరించాలని తెలిపార.,ప్రధానంగా చేనేత సమస్యలైనా బడ్జెట్లో నిధులు కేటాయింపు, నేతన్న నేస్తం అమలు చేయాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వెంటనే అమలు చేయాలని తెలిపారు. చేనేతలకు ఒక లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని,దరఖాస్తు చేసుకున్న అర్హులైన చేనేతలందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని, చేనేతలకు ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు.మర మగ్గాల్లో చేనేత రకాలు తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలన్నిటిని చేనేత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులుగా తమరికి తెలుపుతూ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తదుపరి 2025 సంవత్సరపు క్యాలెండర్ కూడా విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకట్ నారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు