Wednesday, January 8, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు చెల్లించండి.. సిఐటియు నాయకులు

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు చెల్లించండి.. సిఐటియు నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వెంటనే జీతాలను చెల్లించాలని కోరుతూ సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి. రమణ, కో కన్వీనర్ అయూబ్ కాన్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్,ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు నాగరాజు, అనిల్ ,పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుంద ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గత 16 రోజుల సమ్మె కాలంలో ఒప్పంద జీవో కాపీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు పెర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు