Homeజిల్లాలుఅనంతపురంగిరిజన గురుకులంలో ప్రవేశాలుకు – మే 20 వరకు దరఖాస్తులు

గిరిజన గురుకులంలో ప్రవేశాలుకు – మే 20 వరకు దరఖాస్తులు

- Advertisement -

ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ తెలిపారు. గురువారం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ తరగతి వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. 3వ తరగతిలో మొత్తం 40 సీట్లు ఉండగా, అందులో ఎస్టీకి 32, ఎస్సీకి 5, బీసీకి 2, ఓసీకి 1 సీటు కేటాయించారు. 4వ తరగతిలో 38 సీట్లు, 5వ తరగతిలో 40 సీట్లు, 6వ తరగతిలో 38 సీట్లు, 7వ తరగతిలో 28 సీట్లు, 8వ తరగతిలో 31 సీట్లు, 9వ తరగతిలో 23 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు మే 20వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9573593265, 90102617, 9550330009 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు