Homeజాతీయం"అక్షయ్ " కుమార్తెకు సైబర్ వేధింపులు: నిందితుడి అరెస్ట్

“అక్షయ్ ” కుమార్తెకు సైబర్ వేధింపులు: నిందితుడి అరెస్ట్

- Advertisement -


ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దష్టికి తీసుకువచ్చారని ఏడీజే తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యపడిందని అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై స్టేట్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమానికి అక్షయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సైబర్ క్రైమ్ గురించి మాట్లాడుతూ తన ఇంట్లో జరిగిన ఘటనను వెల్లడించారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సమయంలో అపరిచితుడి నుంచి మెసేజ్ వచ్చిందని, న్యూడ్ ఫొటోలు పంపాలని అతడు సందేశం పంపాడని ఈ విషయం తన కుమార్తె ఇంట్లో చెప్పడంతో సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించినట్లు అక్షయ్ తెలిపారు. పాఠశాల విద్యార్ధులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించేలా సైబర్ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్టుగా పెట్టాలని ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అక్షయ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు