ఇంచార్జ్ గ్రంథాలయ అధికారి,గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రాము
విశాలాంధ్ర ధర్మవరం:: వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ ఇంచార్జ్, రికార్డ్ అసిస్టెంట్ రాము తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఉచిత వేసవి శిష్యుల భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆవశ్యకతపై తరగతిలో నిర్వహించారు. తదుపరి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి చెస్సు ,క్యారం బోర్డ్ ఆటలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిసోర్స్ పర్సన్ కేశవ, చంద్రశేఖర్ పాల్గొని గ్రంథాలయం యొక్క విశిష్టతను, ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, పాఠశాల విద్యార్థులు, గ్రంధాలయ పాఠకులు పాల్గొన్నారు.
కంప్యూటర్ పై అవగాహన తరగతులు
- Advertisement -
RELATED ARTICLES


