Homeమద్యం దుకాణాలపై వేటు

మద్యం దుకాణాలపై వేటు

- Advertisement -

విజయ్ సంచలన నిర్ణయం

న్యూదిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. విజయ్ నిర్ణయంతో 717 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలతో పాటు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టంచేసింది. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ అధ్వర్యంలో నడుస్తున్న వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ఆదేశించింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా… ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 మద్యం రిటైల్ దుకాణాలు ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్నాయి. తాజాగా మూసివేయడానికి గుర్తించిన 717 దుకాణాల్లో… 276 ప్రార్థనా స్థలాల సమీపంలో, 186 విద్యాసంస్థలు, మరో 255 బస్‌స్టాండ్‌ల సమీపంలో ఉన్నాయి. సీఎం విజయ్ తాజా ఆదేశాలతో మరికొన్ని రోజుల్లో ఇవి మూతపడనున్నాయి.
సరైన నిర్ణయం: కమల్ హాసన్
మద్యం దుకాణాలపై సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థల సమీపంలో మద్యం దుకాణాలు తొలగించాలని తమిళ ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్నారన్నారు. సోదరుడు విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. మద్యం అమ్మకాలు ప్రభుత్వ విధిగా ఉండకూడదని, వాటిని నియంత్రించే బాధ్యత మాత్రమే తీసుకోవాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 717 దుకాణాలతో ఆగిపోకూడదన్నారు. ఈ చర్యను నిరంతరాయంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
విజయ్‌కు విశాల్ అభినందనలు
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాల వద్దనున్న 717 మద్యం దుకాణాలు మూసివేస్తూ విజయ్ తీసుకున్న నిర్ణయంపై నటుడు విశాల్ హర్షం వెలిబుచ్చారు. సీఎం హోదాలో విజయ్ తీసుకున్న నిర్ణయంపై కాలేజీ రోజుల నుంచి ఆయన సన్నిహిత స్నేహితుడిగా పేరున్న నటుడు విశాల్ ప్రశంసలు కురిపించారు. తనదైన శైలిలో విజిల్ వేస్తూ ‘విజిల్స్ టూ యూ’ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ‘మీకు అభినందనలు, విజిల్స్ టూ యÖ, హ్యాట్యాప్ టూ యూ విజయ్. 717 మద్యం దుకాణాలను ముఖ్యంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న వాటిని మూసివేయాలన్న మీ నిర్ణయం అభినందనీయం, అద్భుతం. టాస్మాక్ షాపుల వల్ల ప్రతిరోజూ విద్యార్థినులు ఆ దుకాణాలు దాటి ఇంటికి చేరుకునేటప్ప్పుడు వేధింపులకు గురవుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మీకు, మీ ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తున్నాను’ అని ఆ వీడియోలో విశాల్ ప్రశంసలు కురిపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు