Homeజాతీయంకనుల విందుగా…కవల గున్నలు

కనుల విందుగా…కవల గున్నలు

- Advertisement -


నైనితాల్: ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో కవల పిల్లలతో ఓ ఏనుగు దర్శనమిచ్చింది. ఆరోగ్యకరమైన రెండు గున్న ఏనుగులతో సందర్శకులను ఆనందపరచింది. తల్లీ పిల్లలను చూసిన జంతు ప్రేమికులు, పర్యాటకులు తెగ ముచ్చట పడుతున్నారు. ఈ పార్కులో అవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంతో హుషారుగా తల్లి ఏనుగుతో గున్న ఏనుగులు ముద్దు ముద్దుగా కలియ తిరుగుతున్న దృష్యం చూసిన పర్యాటకులు పులకించిపోతున్నారు. వన్యప్రాణుల నిపుణుడు సంజయ్ ఛిమ్‌వాల్ ఇటీవల జంగిల్ సఫారీలో తిరుగుతూ ఈ ఏనుగులను చిత్రీకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్వేచ్ఛగా తిరుగాడుతున్న తల్లీబిడ్డలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నట్లు పార్కు డైరెక్టర్ సాకేత్ బడోలా ఆదివారం వెల్లడించారు. ఏనుగుల జననాల్లో ఒక శాతం మాత్రమే కవల గున్నలు పుడతాయని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల గర్భధారణ కాలాన్ని అధిగమించి ఓ ఏనుగు కవల గున్నలకు జన్మనిచ్చి, వాటిని పెంచడం అద్భుతమైన విషయంగా పేర్కొంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు