విశాలాంధ్ర, కదిరి పట్టణం : లోని బాలికల పాఠశాల సమీపంలో ఉన్న మనుస్ డాన్స్ నిర్వాహకులు డాక్టర్ తేపల్లె మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ ఆరుద్ర శ్రీనివాస్, ప్రముఖ ఆస్ట్రాలజర్ కుంచెపు గంగరాజు నటరాజ స్వామికి పూజలు ప్రారంభించారు. మనుస్ డాన్స్ అకాడమీ స్థాపించి మూడు సంవత్సరాల కాలంలో కదిరి ప్రాంతాల విద్యార్థులను జిల్లా,రాష్ట్ర జాతీయస్థాయిలో ఎన్నో కళా వేదికల మీద నృత్య ప్రదర్శనలో పాల్గొని ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని కొనియాడారు. కళా రంగంలో చేస్తున్న సేవలకు,శ్రీ పద్మావతి ట్రస్ట్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు.డాక్టర్ తేపల్లె మనోహర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ నృత్య కళను ప్రముఖ టీవీ ఛానల్, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ, డాన్స్ కర్ణాటక డాన్స్ చంద్రముఖి 2, జపాన్, సైందవ్ సినిమా క్రమంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డే బాబు,రామకృష్ణ, కృష్ణమోహన్ రెడ్డి మాస్టర్స్ చిన్ను, వినోద్ పాల్గొన్నారు.