Homeఅంతర్జాతీయంసీనియర్ టెకీ ‘సోమశేగర్’ మృతి

సీనియర్ టెకీ ‘సోమశేగర్’ మృతి

- Advertisement -

అమెరికాలోని మద్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు
వాషింగ్టన్:
భారత సంతతికి చెందిన సీనియర్ టెకీ అమెరికాలో కన్నుమూశారు. సియోటెల్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. సోమశేగర్ (59) ఆకస్మికంగా మరణించారు. దాన్ని ధ్రువీకరించిన మద్రోనా వెంచర్ సంస్థ.. ఆయనకు నివాళులర్పించింది. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు. పుదుచ్చేరీలో జన్మించిన సోమసేగర్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగిన ఆయన…మద్రోనా వెంచర్ గ్రూప్‌లో ఎండీగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఈయనకు పెట్టుబడులున్నాయి. కాగా…ఆయన మరణవార్తకు కొన్ని గంటల ముందే 2026 సంవత్సరానికి గాను ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లను గుర్తించే 100 జాబితాలో చోటు దక్కింది.
ప్రముఖుల దిగ్భ్రాంతి…
సోమసేగర్ ఆకస్మిక మరణంపై టెక్ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనకు నివాళులర్పిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఏఐ సలహాదారుగా ఉన్న భారత సంతతికి చెందిన శ్రీరామ్‌కృష్ణన్ సోమసేగర్‌కు నివాళులర్పించారు. తన కెరీర్‌లో సోమసేగర్ పాత్ర కీలకమంటూ ఎక్స్‌లో భావోద్వేగమైన పోస్టు పెట్టారు. ఇక, మైక్రోసాఫ్ట్‌లోని పలువురు మాజీ సహ ఉద్యోగులు సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు