Homeజాతీయం24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -

న్యూదిల్లీ: ఆశావాహులకు ఆనందం…మొదలైన రాజ్యసభ పదవుల సంరంభం. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రాజకీయ నాయకులకు శుక్రవారం శుభవార్త వచ్చింది. 24 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్, జులైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పది రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. జూన్ 1న నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేదీ. 9న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11 వరకు గడువు తేదీగా ఈసీ ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఏపీలో నాలుగు స్థానాలకు…
ఏపీ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, సానా సతీష్‌ల పదవీ కాలం జూన్ 26న ముగియనుంది. దీంతో ఏపీలోని నాలుగు స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అవకాశం లేకపోయినప్పటికీ బీజేపీ ఒక స్థానం అడుగుతున్నట్లు భోగట్టా. వైసీపీకి అవకాశం ఎలాగూ లేదు. అయితే జనసేనకు ఒకటి తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఉన్న రెండింటిలో టీడీపీ ఏవిధంగా సర్దుబాటు చేస్తుందనే దానిపై చర్చ ఇదివరకే మొదలైంది. సామాజికవర్గ సమీకరణాలు, పార్టీ ప్రయోజనాలు బేరీజు వేసుకుని ఆయా పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థులను నిర్ణయిస్తారు. అయితే…ఆ నిర్ణయం ఇది వరకే జరిగిఉంటుందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ నెల రోజులు పాటు ఈ నలుగులాట, చర్చోపచర్చలకు దారిచూపుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు