ఆర్ఆర్ కోచ్‌కు భరోసా ఇచ్చిన సూర్యవంశీ
జైపూర్: హ్యాట్రిక్ ఓటములతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు లఖ్‌నవూపై అద్భుత విజయంతో రేసులోకి వచ్చింది. వైభవ్ సూర్యవంశీ సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు ఆరఆర్ ప్రధాన కోచ్ కుమార సంగక్కర చాలా ఒత్తిడిలో ఉన్నాడని… వైభవ్ మాత్రం గెలిపిస్తానని అతనికి భరోసా ఇచ్చాడట. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైభవ్ వెల్లడించాడు. 15 ఏళ్ల కుర్రాడు ఇంత పరిణతితో ఆలోచించడం అద్భుతమని సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 579 పరుగులు ఉన్నాయి. ముంబయితో ఆరఆర్ మే 24న తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సిఉంది. ఇందులో గెలిస్తే నాకౌట్‌కు చేరుకుంటుంది.
యువ సచిన్‌ను తలపిస్తున్నాడు: కిరణ్ మోరె
‘సచిన్ తెందూల్కర్ భారత జట్టులోకి వచ్చినప్ప్పుడు హేమాహేమీ బౌలర్లతో ఢీకొట్టాల్సి వచ్చింది. ఎందుకో అతడు చాలా స్పెషల్ అని అప్ప్పుడే అనుకున్నా. ఇప్ప్పుడు వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే నాకు యువ సచిన్ గుర్తుకొచ్చాడు. తప్పకుండా దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని అనుకుంటున్నా. క్రికెట్ కోసమే సూర్యవంశీని ఆ దేవుడు తయారుచేసినట్లుగా ఉంది. అతడు ఎలాంటి విధానంలో ఆడుతున్నాడో అలాగే కొనసాగనివ్వాలి’ అని మాజీ క్రికెటర్ కిరణ్ మోరె అభిప్రాయపడ్డారు.
చిచ్చర పిడుగులా రెచ్చిపోతున్నాడు…
12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోపీలో బీహార్ తరపున అరంగేట్రం చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన రెండవ అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ఎడం చేతి వాటం గల ఈ చిచ్చర పిడుగు దూకుడుగా ఆడి పరుగుల వరద పారిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ సీజన్లో 500కు పైగా పరుగుల చేసి అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆయన ఆటతీరుపై దినేశ్ కార్తీక్ వంటి మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్లో ప్రధాన పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.
నేనున్నానీ…మీకేం కాదని!
- Advertisement -
RELATED ARTICLES


